లేపాక్షి ఫౌండేషన్: శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా కవితల ఆహ్వానం

Sathya Sai Baba Centenary: Poem Submission to Lepakshi Foundation Submit your poem for the Bhagawan Sri Sathya Sai Baba 100th Birth Anniversary anthology. Theme: Sai Baba’s Life. Deadline: October 15.

లేపాక్షి ఫౌండేషన్: శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా కవితల ఆహ్వానం

ప్రపంచవ్యాప్తంగా భక్తులను కలిగిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి 100వ జయంతిని పురస్కరించుకుని, లేపాక్షి ఫౌండేషన్ ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాబా గారి జీవిత ఇతివృత్తం ఆధారంగా కవితా సంకలనాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ సంకలనం కోసం తెలుగు కవుల నుండి కవితలను ఆహ్వానిస్తున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది.

శ్రీ సత్యసాయి బాబా బోధనలు, సేవలు, ఆధ్యాత్మిక ప్రయాణం వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని కవులు తమ కవితలను రూపొందించాలని లేపాక్షి ఫౌండేషన్ టీమ్ కోరింది.

కవితలు పంపేవారికి ముఖ్య సూచనలు:

  • కవులు తమ కవితలను సత్యసాయి బాబా జీవిత ఇతివృత్తం ఆధారంగా మాత్రమే పంపాలి.

  • కవితల్లో అక్షర దోషాలు, భావ దోషాలు లేకుండా జాగ్రత్త వహించాలి.

  • ఒక కవి ఒక కవితను మాత్రమే పంపాల్సి ఉంటుంది.

  • కవితల ఎంపిక విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయంగా ఉంటుందని ఫౌండేషన్ స్పష్టం చేసింది.

  • కవితలు పంపుటకు చివరి తేదీ అక్టోబర్ 15గా నిర్ణయించారు.

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల వేళ, ఆయన జీవితాన్ని కవిత్వ రూపంలో ఆవిష్కరించే ఈ అరుదైన అవకాశం కోసం తెలుగు కవులు ముందుకు రావాలని లేపాక్షి ఫౌండేషన్ టీమ్ అభినందనలు తెలియజేస్తూ పిలుపునిచ్చింది.

కవులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, భగవాన్ సత్యసాయి బాబా పట్ల తమ భక్తి, గౌరవాలను కవితల ద్వారా చాటాలని కోరుకుంటున్నారు. కవితలు పంపాల్సిన వివరాల కోసం కవులు లేపాక్షి ఫౌండేషన్ ను సంప్రదించవచ్చు.

- కవితలు ఈ సమూహంలో జాయిన్ అయ్యి పంపగలరు.

సత్యసాయి జయంతోత్సవం - కవితా సంకలనం - Whatsapp Group Link