SSC : పరీక్షల తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే

SSC : పరీక్షల తేదీలు మారాయి.. కొత్త తేదీలు ఇవే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్, జూన్ నెలల్లో జరగాల్సిన పలు పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతోపాటు సీహెచ్ఎస్‌ఎల్‌కు సంబంధించి కొత్తగా పరీక్షల తేదీలను వెల్లడించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే.. జూన్ 4, 5, 6 తేదీల్లో జరగాల్సిన జూనియర్ ఇంజినీర్ పరీక్షలను జూన్ 5, 6 7 తేదీల్లో నిర్వహించనున్నారు.

అలాగే.. మే 9, 10, 13 తేదీల్లో జరగాల్సిన ఢిల్లీ పోలీస్ (ఎస్ఐ, సీఏపీఎఫ్) పరీక్షలు జూన్ 27, 28, 29 తేదీలకు వాయిదా వేశారు. మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన సెక్షన్ పోస్టు ఎగ్జామినేషన్ ఫేజ్ – X!! పరీక్ష జూన్ 24, 25, 26 తేదీల్లో జరుగనుంది. పదో తరగతి అర్హతతో జరిగే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (సీహెచ్ ఎస్ ఎల్) పరీక్షలు జులై 1 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు.