బుల్లితెరపై ప్రభాస్ సలార్ సందడి.. ఏ ఛానల్‌లో వస్తుందంటే?

బుల్లితెరపై ప్రభాస్ సలార్ సందడి.. ఏ ఛానల్‌లో వస్తుందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 AD' సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు గతేడాది డిసెంబర్‌లో రిలీజైన సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.700 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో కూడా దుమ్మురేపింది. తాజాగా ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కి రెడీ అయింది.

ఎప్పుడంటే?
స్టార్ మాలో ఏప్రిల్ 21న ఆదివారం సాయంత్రం 05:30 గంటలకు సలార్ సినిమా ప్రసారం కానుంది. మరి థియేటర్లో ఓటీటీలో సత్తా చాటిన ఈ చిత్రం టీవీలో ఎంత రేటింగ్ సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, ఈశ్వరీ రావు, టిన్ను ఆనంద్, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

ప్రభాస్-పృథ్వీరాజ్ మధ్య ఫ్రెండ్‌షిప్‌ను సినిమాలో అద్భుతంగా చూపించారు ప్రశాంత్ నీల్. ఇక యాక్షన్ సీన్లు కూడా సినిమాకి హైలెట్ అయ్యాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌కి సలార్‌తోనే సాలిడ్ హిట్ దక్కింది. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కావడంతో సలార్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది. కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సలార్ 2 షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 మరింత హైలెట్‌గా ఉంటుందని ప్రశాంత్ నీల్ ఎప్పుడో చెప్పారు.